వేడంగిపాలెంలో ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ మావూళ్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర

వేడంగిపాలెంలో నేటి నుంచి శ్రీశ్రీశ్రీ మావూళ్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర మహోత్సవాలు ప్రారంభం అయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలంలో ఉంటుందీ వేడంగిపాలెం. ఇక్కడ కొలువైన శ్రీశ్రీశ్రీ మావూళ్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు ప్రతి ఏటా పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఈ జాతర మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సైతం భక్తులు వస్తుంటారు. ఈ ప్రాంతంలో జరిగే అతి పెద్ద జాతరగా దీనిని చెప్పవచ్చు.

శ్రీశ్రీశ్రీ మావూళ్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్ల జాతర నేడు ప్రారంభమైంది. రేపు గ్రామంలో పెద్ద ఎత్తున అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముందు ఇవాళ రాత్రి నుంచే వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు అంటే రేపు ఉదయం గుడికి వెళ్లే వరకూ అసాధులు, గరగ నృత్యాలు, తీన్మార్ డప్పులు, బాణసంచా, బుట్టబొమ్మలతో జాతర వంటి కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జాతర నేపథ్యంలో ఆలయాన్ని విద్యుద్దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.

Share this post with your friends