హనుమంత వాహ‌నంపై శ్రీ ప్రస‌న్న వేంకటేశ్వర‌స్వామి రాజ‌సం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇవాళ సాయంత్రం గజ వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. ఇక నిన్న ఉదయం విశేష‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్తుల‌కు ద‌ర్శమిచ్చారు బ్రహ్మోత్సవాలలో గరుడ వాహనోత్సవం అతి ముఖ్యమైనది. గరుడుని సేవాదృక్పథం, మాతృభక్తి, ప్రభుభక్తి, సత్యనిష్ఠ, నిష్కళంకత, ఉపకారగుణం సమాజానికి స్ఫూర్తిదాయకాలు. గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుంద‌ని భక్తుల నమ్మకం. ఇందుకే గరుడసేవకు ఎనలేని విశిష్టత ఏర్పడింది.

బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం సాయంత్రం సకల లోక కల్యాణ కారకుడు అయిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు దివ్యమోహినీ రూపంలో ఉత్సవమూర్తియై నాలుగు మాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులను తన కృపాకటాక్షాలతో అనుగ్రహించారు. ఆ దివ్య మోహినీ మాయాశక్తికి వశమైన జగత్తు వాహ్య వాహకభేదాన్ని గుర్తుంచుకోలేకపోయింది. కనుక శ్రీవారు జగన్మోహినియై పల్లకీలో కూర్చొని ఉంటారు. ఈనాటి శ్రీవారి మోహినీ అవతారం భౌతికంగా జగన్మోహకత్వాన్నీ, ఆధ్యాత్మికంగా మాయాతీతశుద్ధ సత్త్వస్వరూప సాక్షాత్కారాన్ని ఏక సమయంలోనే సిద్ధింపజేస్తుంది.

Share this post with your friends