శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి వారంలో ఒక్కరోజే అనుమతి..

శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయం గురించి మనం ముందుగానే తెలుసుకున్నాం. ఈ ఆలయానికి శుచిగా వెళ్లకుంటే తేనెటీగలు వెంటాడి మరీ కుడతాయట. అయితే తేనెటీగలు తరిమే సమయంలో గోవింద నామ స్మరణ చేస్తే మాత్రం కుట్టవని అంటారు. ఇక్కడ కొలువైన రంగనాయక స్వామిని విష్ణుమూర్తి స్వరూపంగా భావిసతారు. ఈ ఆలయం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ సమీపంలోని దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉంటుందని తెలుసుకున్నాం.

అయితే ఈ ఆలయానికి వెళ్లాలంటే భక్తులకు నిత్యం అవకాశం ఉండదుద. శనివారం మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే తెరిచి ఉంటుంది. అప్పుడు మాత్రమే స్వామివారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అలాగే వర్షాలు కురిసిన సమయంలో కూడా భక్తుల భద్రతను దృష్ట్యా అధికారులు అనుమతి ఇవ్వరు. ఈ ఆలయానికి వెళ్లాలంటే.. గిద్దలూరు నుంచి అంబవరం, వెలుపల్లి గ్రామాల మీదుగా జేపీ చెరువు గ్రామానికి చేరుకోవచ్చు. మరోవైపు నుంచి కూడా వెళ్లవచ్చు. రాచర్ల మండలంలోని అన్నం పల్లె గ్రామం మీదుగా కూడా జేపీ చెరువు గ్రామానికి వెళ్ళవచ్చు. ప్రతి శనివారం ఈ ఆలయానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.

Share this post with your friends