10న తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ జయంతి..

తిరుమల తిరుపతి దేవస్థానంలోని హిందూ ధార్మిక ప్రాజెక్టులు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీన తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి 43వ వర్ధంతి, శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముందుగా ఉదయం 9 గంటలకు ఎస్వీ ఓరియంటల్ కళాశాలలో శ్రీ గౌరిపెద్ది రామసుబ్బ శర్మ విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం జరగనుంది.

తరువాత ఉదయం 9.30 గంటలకు శ్వేత భవనం ఎదురుగా గల శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఉదయం 10.30 గంటలకు అన్నమాచార్య కళామందిరంలో శ్రీ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి వర్ధంతి సందర్భంగా సభా కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6 గంటలకు శ్రీ గౌరిపెద్ది రామసుబ్బశర్మ 102వ జయంతి సందర్భంగా సభా కార్యక్రమం ఉంటుంది.

Share this post with your friends