తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ శుక్రవారం శోభ.. సాక్షాత్తు శివుడే శ్రావణమట..

ఇవాళ శ్రావణ శుక్రవారం. శ్రావాణమాసంలో శుక్రవారాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇవాళ మహిళలంతా పెద్ద ఎత్తున లక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు. అలాగే అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయం శ్రావణమాస శోను సంతరించుకుంది. మొదటి శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో చండీ హోమం, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రికి సైతం భక్తులు భారీగా వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక తెలంగాణలోనూ అన్ని అమ్మవారి ఆలయాల్లోనూ భక్తుల సందడి కనిపిస్తోంది.

స్కాంద పురాణంలో శ్రావణ వైభవాన్ని పరమేశ్వరుడు స్వయంగా తెలిపాడు. సనత్కుమార మహర్షికి శ్రావణ వైభవాన్ని వివరించాడు. ‘ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః’ అంటే పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపమని.. సాక్షాత్తు తానే శ్రావణ మాసమని శివుడు తెలిపాడు. శ్రావణమాస మాహాత్మ్యాన్ని 24 అధ్యాయాల్లో పరమేశ్వరుడు వివరించాడు. మహర్షి కోరికను మన్నించి శ్రావణ మాస వైశిష్ట్యాన్ని తెలిపాడట. అంతేకాకుండా తన స్వరూపమైన శ్రావణ శోభను చూసి తరించేందుకు నాలుగు ముఖాలతో బ్రహ్మ, వెయ్యి కళ్లతో ఇంద్రుడు సిద్ధంగా ఉంటారని శివుడు పేర్కొన్నాడు. మహేశ్వరుడి గొప్పతనాన్ని ఆదిశేషుడు వెయ్యి నాలుకలతో శ్లాఘిస్తూ ఉంటాడట.

Share this post with your friends