ఇక శ్రావణ మాసం వచ్చిందంటే అన్ని ఆలయాల్లోనూ సందడి నెలకొంటుంది. భక్తులు పెద్ద ఎత్తున ముఖ్యంగా అమ్మవారి ఆలయాలను దర్శిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వేములవాడ రాజన్న ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా శ్రావణ మాసంలోని సోమవారాల్లో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సాయంత్రం మహాలింగార్చన ఉంటుంది. ఇక శ్రావణ శుక్రవారాల్లో శ్రీరాజరాజేశ్వరీ దేవి, శ్రీమహలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వమిస్తూ ఉంటారు.
పైగా శ్రావణ మాసంలో ఉండే పండుగలను సైతం ఈ ఆలయంలో బాగా నిర్వహిస్తూ ఉంటారు. ఆగస్ట్ 19 రాఖీ పౌర్ణమి, 26న గోకులాష్టమి సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పైగా ఆలయంలో అద్దాల మండపంలో డోలోత్సవం, ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహిస్తారు. 30న శ్రావణ బహుళ ఏకాదశి పునర్వసు నక్షత్రం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 1న పూర్ణాహుతి, రుద్ర హవనం, మహా లింగార్చన నిర్వహిస్తారు. ఇక శ్రావణమాస అది, సోమవారాల్లో గర్భాలయ అభిషేకం, అన్నపూజలు ఉండవని ఆలయ ఈవో తెలిపారు. ఇతర సేవల విషయంలో ఎలాంటి మార్పూ ఉండదట.