వినాయక చవితి సందర్భంగా శ్రీకపిలేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు..

తిరుప‌తి శ్రీ కపిలేశ్వరాలయంలో సెప్టెంబరు 7న వినాయక చవితిని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, శ్రీ వినాయ‌క స్వామివారి మూలవర్లకు అభిషేకం, అర్చన చేప‌డ‌తారు. సాయంత్రం 5.30 గంట‌ల‌కు శ్రీ వినాయకస్వామివారికి మూషికవాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో.. రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ఉద‌యం 8 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. అర్చన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు జ‌రుగ‌నున్నాయి.

సెప్టెంబరు 6న ఖాళీ టిన్‌ల విక్రయానికి సీల్డ్ టెండ‌ర్ల ఆహ్వానం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిప‌ప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు సీల్డ్ టెండ‌ర్ల‌ను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండ‌ర్ పొందిన వారు టీటీడీ వినియోగించిన ఖాళీ టిన్‌లు సేక‌రించ‌వ‌చ్చని తెలిపింది. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండ‌ర్లు సెప్టెంబరు 6వ‌ తేదీ మ‌ధ్యాహ్నం 3 గంట‌లలోపు అంద‌జేయాలని టీటీడీ సూచించింది. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించవచ్చని తెలిపింది.

Share this post with your friends