సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు

ఇతర నెలలతో పోలిస్తే సెప్టెంబర్ నెలలో పర్వదినాలు కాస్త తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబరు నెలలో విశేష పర్వదినాలు ఇలా ఉన్నాయి.

* సెప్టెంబరు 5న బలరామ జయంతి, వరాహ జయంతి.

* సెప్టెంబరు 7న వినాయక చవితి.

* సెప్టెంబరు 17న అనంత ప‌ద్మ‌నాభ వ్ర‌తం.

* సెప్టెంబరు 18న పౌర్ణమి శ్రీవారి గరుడసేవ.

* సెప్టెంబరు 28న సర్వ ఏకాదశి.

ఆదివారం వచ్చిందంటే చాలు.. తిరుమల భక్తులతో కిటకిటలాడుతుంది. కానీ ఈ ఆదివారం మాత్రం వర్షాల కారణంగా భక్తుల రద్దీ చాలా వరకూ తగ్గిపోయింది. వర్షాల కారణంగా జనం బయటకు వచ్చే పరిస్థితి లేదు. పైగా పలు రైళ్లు రద్దవడంతో భక్తుల సంఖ్య స్వల్పంగా ఉంది. ఇవాళ శ్రీ మలయప్ప స్వామి దర్శనానికి కేవలం 5 కంపార్ట్‌మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం 8 గంటలు పడుతోంది. టైమ్ స్లాట్ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు మూడు గంటల్లో అవుతోంది. నిన్న తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని 81,207 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 31,414 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.53 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

Share this post with your friends