
ప్రతి నెలా మాదరిగానే డిసెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు చాలా ఉన్నాయి. డిసెంబర్ నెల తొలి రోజునే అధర్వణ వేద పారాయణం చేయనున్నారు. అనంతరం ముక్కోటి ఏకాదశి, కార్తీక దీపోత్సవం వంటివి నిర్వహించనున్నారు.
• 1న శ్రీవారి ఆలయంలో 4వ విడత అధర్వణ వేదపారాయణం ప్రారంభం.
• 11న సర్వ ఏకాదశి.
• 12న చక్రతీర్థ ముక్కోటి.
• 13న తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.
• 14న తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• 15న శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం.
• 16న ధనుర్మాసారంభం.
• 26న సర్వ ఏకాదశి.
• 29న మాస శివరాత్రి, తొండరడిప్పొడియాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• 30న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం.
