కాణిపాకం వినాయకుడికి 17 నుంచి ప్రత్యేక ఉత్సవాలు..

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 7న వినాయక చవితి నాటి నుంచి కాణిపాకం వినాయకుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయని ఇప్పటికే చెప్పుకున్నాం. 16న బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అయితే 17వ తేదీ నుంచి ప్రత్యేక ఉత్సవాలు జరుగనున్నాయి. అంటే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయంలో ఈ నెల 7న మొదలైన ఉత్సవాలు మొత్తంగా 21 రోజుల పాటు జరుగనున్నాయన్న మాట. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారిని ప్రత్యేక ఆభరణాలతో అందంగా అలంకరిస్తారు. ఇక 8వ తేదీ నుంచి ప్రతి రోజూ ఏదో ఒక వాహన సేవ జరుగనుంది. ప్రతిరోజూ జరిగే వాహన సేవల్లో సాంస్కృతిక కార్యక్రమాలు సైతం జరుగనున్నాయి.

17 నుంచి ప్రత్యేక ఉత్సవాలు..

సెప్టెంబర్ 17న అధికార నంది వాహన సేవ
సెప్టెంబర్ 18న రావణ బ్రహ్మ వాహన సేవ
సెప్టెంబర్ 19న యాళి వాహన సేవ
సెప్టెంబర్ 20న విమానోత్సవం
సెప్టెంబర్ 21న పుష్ప పల్లకి సేవ
సెప్టెంబర్ 22న కామధేను వాహన సేవ
సెప్టెంబర్ 23న సూర్య ప్రభ వాహన సేవ
సెప్టెంబర్ 24న చంద్ర ప్రభ వాహన సేవ
సెప్టెంబర్ 25న కల్పవృక్ష వాహన సేవ జరుగుతుంది.
సెప్టెంబర్ 26న గణనాథునికి పూలంగి సేవ
సెప్టెంబర్ 27న తెప్పోత్సవం. దీంతో ప్రత్యేక ఉత్సవాలు ముగియనున్నాయి.

Share this post with your friends