తిరుమలలో గరుడ సేవకు ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. గరుడ సేవకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తారు. ఈ గరుడ సేవ అక్టోబరు 8న జరగనుంది. దీనికోసం వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శన ఏర్పాట్లు నిర్వహించనున్నారు.

– దాదాపు 2 లక్షల మంది భక్తులు గ్యాలరీల్లో వేచి ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. గరుడ సేవ దర్శనం కోసం ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్లలో వేచి ఉండే భక్తులను సుపథం, సౌత్‌ వెస్ట్‌ కార్నర్‌, గోవింద నిలయం నార్త్‌ వెస్ట్‌ గేట్‌, నార్త్‌ ఈస్ట్‌ గేట్ల ద్వారా గ్యాలరీల్లోకి అనుమతిస్తాం.

– గరుడసేవ రోజున 24 గంటల పాటు ఘాట్‌ రోడ్లు, శ్రీవారి మెట్టు మార్గం తెరిచి ఉంచడం జరుగుతుంది.

– గరుడ వాహనాన్ని సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభించి భక్తులందరూ దర్శించుకునేలా రాత్రి 11 గంటల వరకైనా నెమ్మదిగా ముందుకు తీసుకెళతామని టీటీడీ వెల్లడించింది.

– బయట వేచి ఉండే భక్తులు తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండి భద్రతా విభాగం నిబంధనలు పాటించాలి. అందరికీ గరుడసేవ దర్శనం కల్పిస్తాం.

– భక్తుల భద్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుమల ఘాట్‌ రోడ్లలో ద్విచక్రవాహనాల రాకపోకలను రద్దు చేయడమైనది.

పార్కింగ్ –

– తిరుపతిలోని అలిపిరి పాత చెక్‌ పాయింట్‌ వద్ద రెండు వేల టూ వీలర్లు, వినాయక్‌నగర్‌ క్వార్టర్స్‌, నెహ్రూ మున్సిసల్‌ గ్రౌండ్‌, భారతీయ విద్యాభవన్‌, దేవలోక్‌ల వద్ద ఉన్న గ్రౌండ్‌లలో 4 వీలర్లు, అదనంగా శ్రీవారి మెట్టు వద్ద కూడా పార్కింగ్‌ ఏర్పాట్లు.

– తిరుపతిలోని పార్కింగ్‌ ప్రదేశాల నుంచి తిరుమలకు వెళ్లేలా ఆర్‌టీసీ బస్సుల ఏర్పాటు

– ఆర్‌టీసీ బస్సుల్లో దాదాపు 3 వేల రౌండ్‌ ట్రిప్పుల ద్వారా దాదాపు 3 లక్షల మందిని తరలించేందుకు చర్యలు

– మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 7 నుంచి రాత్రి 1 గంట వరకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తాం. 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు

– భక్తుల కోసం పులిహోర, టమోటా బాత్‌, బిసిబెళా బాత్‌ తదితర అన్నప్రసాదాల ప్యాకెట్లు అందించనున్నారు.

– వాహనాలపై చిల్లర నాణేలు విసరవద్దని మరొకసారి భక్తులకు విజ్ఞప్తి చేసిన టీటీడీ

చక్రస్నానం ఏర్పాట్లు

– శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మ‌హ‌త్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి. సంయమనంతో వ్యవహరించి స్నానమాచరించవలసిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.

– భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు

– భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్లతోపాటు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, బోట్లు.

Share this post with your friends