కామిక ఏకాదశి ఎప్పుడు? ఆ రోజున ఎవరిని పూజించాలి వంటి విషయాలను తెలుసుకున్నాం. ఈ నెల 31న కామిక ఏకాదశి. ఇక ఆరోజున మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. కామిక ఏకాదశి నాడు ధృవ యోగం ఏర్పడనుంది. ఇది చాలా శుభప్రదమని అంటారు. ఈ యోగం 31న మధ్యాహ్నం 2:14 గంటల వరకూ ఉంటుంది. ఈ సమయంలో విష్ణుమూర్తిని ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటటాయట. అలాగే ఈ రోజున ఏర్పడే మరో యోగం వచ్చేసి సర్వార్థ సిద్ధి యోగం. ఇదైతే రోజంతా ఉంటుంది. కామిక ఏకాదశి నాడు శివుడు కైలాస పర్వతంపై కూర్చొని ఉంటాడట.
ముఖ్యంగా కామిక ఏకాదశి నాడు మధ్యాహ్నం 3:55 గంటల వరకూ కైలాసంపైనే ఉంటాడట. ఈ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే చాలా మంచిదట. అనుకున్నవన్నీ నెరవేరుస్తాడట. ఆ పైన చెప్పుకున్న సమయం తర్వాత నందిపై విహరిస్తాడని అంటారు. కామిక ఏకాదశి రోజున ఉదయం వేళ శ్రీ మహా విష్ణువు అవతారమైన కృష్ణ అవతారాన్ని పూజిస్తే మంచిది. పసుపు పువ్వులతో పాటు తులసీదళం, పంచామృతం వంటివి స్వామివారికి సమర్పించాలి. అభిషేక ప్రియుడైన శివుడికి కూడా జలాభిషేకం చేస్తే మంచిదట. ఇక సాయంత్రం సమయంలో రావి చెట్టు వద్ద ఆవ నూనె దీపం వెలిగించాలి. సాత్విక ఆహారం మాత్రమే స్వీకరించాలి.