ఆదివారం మాంసాహారం, మద్యం సేవించకూడదా?

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు విద్యా విధానం గురుకులాల్లో ఉండేది. ఆ సమయంలో గురువులపై విద్యార్థులకు గౌరవభావం ఎక్కువగా ఉండేది. ముఖ్యంగా ఆదివారాల్లో ప్రత్యేక ఆరాధన రోజుగా జరుపుకునేవారు. ఆదివారం సూర్య భగవానుడికి పూజలు చేసేవారు. తద్వారా ఫలితం చాలా బాగుంటుందని.. దీర్ఘాయువు కలుగుతుందని నమ్మేవారు. ఇది బ్రిటీష్ వారికి నచ్చలేదట. భారతీయ సంప్రదాయాలను మార్చకుంటే తమకు కష్టమవుతుందని భావించడంతో ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించారని చెబుతారు.

భారతీయ సంప్రదాయాలను మార్చేందుకే ఆదివారాన్ని విశ్రాంతి దినంగా ప్రకటించి పాశ్చాత్య జీవన విధానం భారతీయులకు అలవాటు చేయడం ఆరంభించారట. ఈ క్రమంలోనే ఆదివారం నాడు మాంసాహారం, మద్యం సేవించడం వంటివి భారతీయులకు అలవాటు చేశారని చెబుతారు. బ్రిటీష్ వారి రాకకు ముందు ఆదివారం నాడు భారతీయులు కటింగ్ చేయించుకోవడం.. షేవింగ్ చేసుకోవడం వంటివి కూడా చేసేవారు కాదట. వీటిని సూర్య భగవానునికి నిషిద్ధంగా భావించేవారు. అలాంటి భారతీయులకు ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించి ఇవన్నీ అలవాటు చేశారని చెబుతారు.

Share this post with your friends