తల్లి తలిస్తే వస్తానన్న శంకరాచార్యులు.. ఆమెకు మరణకాలం సమీపించింది. అప్పుడేం జరిగిందంటే..

ఆదిశంకరాచార్యులవారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వేళ్ళే ముందు తల్లి ఆర్యాంబ చాలా బాధ పడింది. “శంకరా, నువ్వు నాకు ఏకైక పుత్రుడువి కదా! నన్ను వదలి వెళ్ళి పోతున్నావు.. ఆఖరి క్షణాల్లో నాకు ఎవరున్నారు? నాకు దిక్కెవరు?” అని దీనంగా ప్రశ్నించింది. “అమ్మా! ఏ సమయమైనా సరే, నీవు తల్చుకుంటే చాలు.. నీ ముందుంటాను” అన్నాడు శంకరుడు. భగవత్పాదులు శంకరాచార్యులవారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేదు. తన కుమారుడిని ఆర్యాంబ తలచుకుంటూనే ఉంది. తల్లి తలచుకుంటున్నదన్న విషయం గ్రహించిన ఆదిశంకరులు వెంటనే శ్రీ కృష్ణుని ధ్యానించారు.

శ్రీ కృష్ణుడు ఏం కావాలని అడిగాడు. కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షమిచ్చినట్లుగా నా మాతృమూర్తికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారు శంకరాచార్యులవారు. అర్యాంబ తన మనసులో.. ‘నేను తలచుకొంటే శంకర వస్తానన్నాడే మరి రాలేదే ‘ అని తపిస్తున్నప్పుడు.. ఇంతలోనే అక్కడికి ఎవరో వస్తున్న అలికిడైంది. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి ‘శంకరా! అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ‌ తన మనసులో.. ‘శంకరుడు సన్యాసి కదా! ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని’ అనుకున్నది. మెల్లగా కనురెప్పలను తెరిచి చూడగా వచ్చిన వాడిని చూసి షాకైంది. మరి ఆ వచ్చిందెవరో తరువాతి కథనంలో తెలుసుకుందాం.

Share this post with your friends