నేటి నుంచి భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు..

వరంగల్ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో నేటి నుంచి శాకంబరీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవి ఈ నెల 21 వరకూ కొనసాగనున్నాయి. ఇవాళ శాకంబరీ ఉత్సవాల ప్రారంభం నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు. శాకంబరీ దేవి మరెవరో కాదు.. కాంతులను ప్రసరిస్తూ ధనస్సును ధరించిన పరమేశ్వరియే. అమ్మవారిని శాకంబరిగానూ.. శతాక్షి, దుర్గ అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే మహాదేవిగా కీర్తించబడే ఈ అమ్మవారు పోషణ దేవతగా పరిగణిస్తూ ఉంటారు. ఈ శాకాల సముదాయం అంతులేని కోర్కెలను తీర్చే రసాలు కలిగి ఉంటుందని చెబుతారు.

ముఖ్యంగా జీవులకు కలిగే ఆకలి దప్పులతో పాటు మృత్యువు, ముసలితనం, జ్వరం మొదలైనవి పోగొడతాయట. శకంభరి అనే పదానికి ‘కూరగాయలు పండించేది’ అని అర్థం. ఈ శాకంబరీ దేవి మన దు:ఖాలను దూరం చేసి, దుష్టులను శిక్షించి శాంతిని కలుగజేస్తుందట. అలాగే పాపాలను హరించి వేస్తుందని చెబుతారు. ఉమా దేవి, గౌరీ సతీ చండీ కాళికా పార్వతి అనే పేర్లతో కూడా ఈ దేవి ప్రసిద్ధి గాంచింది. ఈ శాకాంబరీ దేవిని భక్తితో పూజించేవారికి తిరుగుండదట. తరిగిపోని అన్నపాన అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని పండితులు చెబుతారు.

Share this post with your friends