కొన్ని రాశుల వారిని ప్రస్తుతం ఏలిన నాటి శని వెంటాడుతోంది. ఈ కారణంగా ఆర్థిక, అనారోగ్య సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలతో బాధ పడుతున్నారు. వారు శని దోషం నుంచి విముక్తి కోసం ఏవేవో పనులు చేస్తుంటారు. అయితే ఇంట్లో జమ్మి మొక్కను నాటి పూజ చేస్తే శని దోషం నుంచి విముక్తి కలుగుతుందట. జమ్మి చెట్టు శనీశ్వరుడికి సంబంధించినదని అంటారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే శనీశ్వరుడి చల్లని చూపు మనపై ఉంటుందట. పైగా వాస్తు దోషాలు కూడా ఉండవట. శమీ మొక్కను చాలా పవిత్రంగా చూస్తారు.
దసరా రోజున తప్పకుండా శమీ పూజ చేస్తారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే సానుకూల శక్తి ఇంట ఉంటుందని నమ్మకం. శనీశ్వరుడి అనుగ్రహం పొందాలన్నా కూడా జమ్మి చెట్టును ప్రతిరోజూ పూజించాట. ముఖ్యంగా శనీశ్వరుడి అనుగ్రహం కోసం శని వారం లేదా సోమవారం జమ్మి చెట్టు కొమ్మకు ఎరుపు రంగు కలువతో పూజ చేయాలట. అలా చేస్తే రాహువు స్థానం మన జాతకంలో బలపడి దుష్ప్రభావాలు తగ్గుతాయట. ఇంటి ప్రధాన ద్వారానికి కుడి వైపున జమ్మిచెట్టును నాటాలట. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు కాదు.. విజయదశమి రోజున నాటితే ఫలితం మరింత బాగుంటుందట. ఈ మొక్క ఇంట ఉంటే ఈశ్వరుని కరుణ కూడా మనపై ఉంటుందట.