కర్మ ప్రదాత, న్యాయ దేవుడు అని శనీశ్వరుడు వ్యక్తులకు వారి వారి కర్మలను బట్టి బహుమతులు, శిక్షలను ఇస్తాడని చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో శనీశ్వరుడిని అత్యంత క్రూరమైన గ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. అలా ఒకే రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు. ప్రస్తుతం శనీశ్వరుడు తన సొంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ నెల మార్చి 29న ఆయన రాశిని మార్చుకోబోతున్నాడు. అంటే మార్చి 29న శనీశ్వరుడు కుంభ రాశి నుంచి బయలుదేరి మీనరాశిలోకి వెళతాడు.
శని దేవుడు అస్తమ స్థితిలో మీన రాశిలోకి ప్రవేశించి.. ఏప్రిల్ 6న మీన రాశిలో ఉదయిస్తాడు. 6వ తేదీ ఉదయం 5:05 గంటలకు మీన రాశిలో శనీశ్వరుడు ఉదయిస్తాడు. దీంతో కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు అదృష్టం బాగా కలిసొస్తుంది. వీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆ అదృష్ణరాశేలేవో చూద్దాం.
కర్కాటక రాశి: శనీశ్వరుడు కర్కాటక రాశి 9వ ఇంట్లో ఉదయించడంతో ఆ రాశి వారి ఆత్మవిశ్వాసంతో పాటు ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు. అంతేకాదు వీరు అత్యంత ఆనందంగా జీవితం సాగిస్తారు. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందవచ్చు.
కన్య రాశి: శని దేవుడు కన్య రాశి 7వ ఇంట్లో ఉదయిస్తాడు. ఈ సమయంలో కన్య రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. వారికి సిరి సంపదలు పెరగడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అయ్యే అవకాశం ఉంది. మీ కెరీర్‌లో ఎదుగుదల, వ్యాపారంలో లాభం, కొత్త ఆస్తి లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు.
ధనుస్సు రాశి: ఈ రాశివారికి శని దేవుడు నాలుగవ ఇంట్లో ఉదయిస్తాడు. ఈ కాలంలో ధనుస్సు రాశి వ్యక్తుల ఆర్థిక పరిస్థితి, కెరీర్‌లో విజయం, కుటుంబంతో సంబంధాలు మెరుగుపడతాయి.