నక్షత్ర సంచారం చేయనున్న శనీశ్వరుడు.. వారికి పండగే..

శనీశ్వరుడిని న్యాయాధిపతి అంటూ ఉంటాం. మన కర్మలను బట్టి ఫలితాలను నిర్ణయిస్తూ ఉంటాడు. ఎవరి జాతకంలో శనీశ్వరుడు శుభాస్థానంలో ఉంటాడో వారికి సుఖ సంపదలు, ఆనందానికి గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు. ఏలిన నాటి శని ఉంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. నేడు శని సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్టం లక్కలా పట్టుకోనుందట. ముఖ్యంగా వ్యాపారస్తులకు విపరీతమైన ధన లాభాలను పొందుతారు. శనీశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు.. నేడు నక్షత్ర సంచారం చేయనున్నాడు.

ఈ నక్షత్ర సంచార ప్రభావం ఆగస్టు 18 వ తేదీ వరకూ కొనసాగనుంది. నేటి నుంచి శనీశ్వరుడు అనుగ్రహంతో మేష రాశి వారికి.. కన్యా.. కుంభ రాశి వారికి అదృష్టం పట్టనుంది. మేషరాశి వారికి శనీశ్వరుడు నక్షత్ర సంచారం కారణంగా ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవడంతోపాటు సంపాదన తద్వారా ఆస్తులు పెరుగుతాయట. కన్యారాశి వారికి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు.. ప్రమోషన్స్ వంటివి తప్పక వస్తాయి. కుంభరాశివారికి శనీశ్వరుడు అధినేత కాబట్టి ఆకస్మిక ధన లాభం ఉంటుందట. వైవాహిక సమస్యలు తీరుతాయి. ఏ పనిలో అయినా ఆటంకం లేకుండా పూర్తవుతుందట. వ్యాపారస్తులకు ఇది మరింత అనుకూల సమయం.

Share this post with your friends