నక్షత్రాన్ని మార్చుకోబోతున్న శనీశ్వరుడు.. ఏం జరగనుందంటే..

నవగ్రహాలు ఎప్పటికప్పుడు రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నవగ్రహాలలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. మన మంచి, చెడుల కారణంగా మనకు ఫలితాన్నిచ్చేది శనీవ్వరుడేనని చెబుతారు. శనీశ్వరుడు అక్టోబర్ 3న అంటే నవరాత్రుల మొదటి రోజున శతభిషా నక్షత్రంలో సంచరించబోతున్నాడు. దీని వలన కొన్ని రాశుల వారికి బాగా కలిసి రానుంది. మరి ఆ రాశులేంటో చూద్దాం.

మేష రాశి: ఈ రాశివారికి బాగా కలిసొస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవడంతో పాటు సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి రావడంతో పాటు అప్పుల నుంచి విముక్తి పొందుతారట.

సింహ రాశి: ఈ రాశి వారికి కెరీర్‌తో పాటు వ్యాపారం, వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. ఏ పని చేపట్టినా కూడా మంచి సక్సెస్ సాధిస్తారు.

ధనుస్సు రాశి: ఈ రాశివారికి నక్షత్ర మార్పు బాగా కలిసొస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనంతో పాటు జీవితంలో సానుకూలత పెరగడం, మానసిక ఒత్తిడి తగ్గడం వంటివి జరుగుతాయి.

Share this post with your friends