శనీశ్వరుడు అన్ని గ్రహాల్లో కెల్ల అత్యంత క్రూరమైన గ్రహమని, వ్యక్తి చేసిన కర్మలను బట్టి ఫలితాన్నిస్తూ ఉంటాడు. అన్ని గ్రహాల మాదిరిగానే శనీశ్వరుడు కూడా ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తూ ఉంటాడు. ఈ సారి శనీశ్వరుడు మీనరాశిలో సంచరించనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు మీనరాశిలోకి 29 మార్చి 2025 శనివారం రాత్రి 10:07 గంటలకు ప్రవేశించనున్నాడు. దీని కారణంగా ద్వాదశ రాశులు ప్రభావితం కానున్నాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి గోల్డెన్ టైం ప్రారంభం కానుంది. అవేంటో తెలుసుకుందాం.
మీన రాశిలో శనీశ్వరుడు సంచారం కారణంగా మేష రాశి వారికి పట్టిందల్లా బంగారం కానుంది. ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక లాభాలు, వ్యాధులు, బాధల నుంచి ఉపశమనం, ఉద్యోగ, వ్యాపారంలో విజయం పొందవచ్చు. అలాగే మిథున రాశి వారికి జీవితంలో ఆనందం, ధన లాభం, వివాహం కాని వారికి వివాహ అవకాశాలు, ఉద్యోగంలో ప్రమోషన్ వంటివి పెరుగుతాయి. కన్యారాశి వారికి కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాన్ని పొందవచ్చు. అలాగే అపారమైన సంపదను ఇస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. వీరికి అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది.