Makar Sankranti coincides with Ekadashi : ఈ సంక్రాంతి స్పెషల్‌ ఇదే… 23 ఏళ్ల తరువాత అరుదైన కలయిక

2026 సంక్రాంతి నిజంగా అరుదైన ఆధ్యాత్మిక విశేషంతో రాబోతోంది. మకర సంక్రాంతి రోజునే శ్రీమహావిష్ణువుకు అంకితమైన షట్తిల ఏకాదశి కలయిక ఏర్పడటం 23 ఏళ్ల తర్వాత వస్తున్న మహాయోగంగా పండితులు చెబుతున్నారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. అదే సమయంలో ఏకాదశి తిథి ఉండటంతో.. చేసే స్నానం, పూజ, దానం అనేక రెట్లు పుణ్యఫలాన్ని ఇస్తాయని శాస్త్ర విశ్వాసం. ఈ రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించి, “ఓం సూర్యాయ నమః” మంత్ర జపం చేయాలి. అనంతరం శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. నల్ల నువ్వులు, గోధుమలు, బెల్లం, దుప్పట్లు దానం చేయడం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ఎంతో శుభప్రదం. ఈ పవిత్ర సంక్రాంతి జీవితంలో శాంతి, సమృద్ధి, సుఖసంతోషాలను ప్రసాదిస్తుందని నమ్మకం.

Makar Sankranti coincides with Ekadashi after 23 years
Makar Sankranti coincides with Ekadashi after 23 years
Share this post with your friends