వైజాగ్‌లోని సంపత్ వినాయకుని ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. కోరిన కోరికలు తీర్చే కల్పతల్లిగా ఈ ఆలయం విరాజిల్లుతోంది. ఘాజీ ఘటనతో ఈ ఆలయం బాగా ఫేమస్ అయిపోయింది. సంపత్ గణపతి వల్లే పాకిస్థాన్ సబ్‌మెరైన్‌ని విజయవంతంగా పేల్చి వేయగలిగామని తూర్పు నావెల్ కమాండ్‌కి చెందిన అడ్మిరల్ కృష్ణన్ భావించారట. ఆనాటి నుంచి విశాఖలో ఉన్నంత వరకూ కృష్ణన్ ప్రతీ రోజూ సంపత్ వినాయక స్వామిని దర్శించి ఆ తరువాతే విధులకు వెళ్లేవారట. ఆ ఘటన తరువాత ఈ ఆలయం చాలా ఫేమస్ అయిపోయింది. మహిమాన్వితుడైన స్వామివారిని నిత్యం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటూ ఉంటారు.
విశాఖపట్నంలోని సిరిపురం జంక్షన్ వద్ద ఈ సంపత్ వినాయక ఆలయం ఉంది. స్థలపురాణం ప్రకారం దీనిని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కలిసి కట్టించారట. ఆ ముగ్గురు వ్యక్తులూ తమిళులే. 1962వ సంవత్సరంలో ఎస్జీ సంబందన్, టీఎస్ సెల్వంగనేషన్, టీఎస్ రాజేశ్వరన్ – తమ కుటుంబ సభ్యులు వైజాగ్‌లో వ్యాపారం నిర్వహించేవారట. ఈ క్రమంలోనే నిత్యం పూజించుకోవడం కోసం వారి వ్యాపార కార్యాలయ ప్రాంగణంలోనే సంపత్ గణపతి ఆలయాన్ని నిర్మించారంట. సంబంధన్ నిర్మించాడు కాబట్టి కొంతకాలం పాటు సంబంధన్ గణేశుడిగా.. ఆ తరువాత కాలక్రమంలో సంపత్ వినాయకుడిగా పిలవడం ఆరంభించారు.