శబరిమలై అరవణ ప్రసాదం చాలా ప్రత్యేకం.. ఆదాయంలో మూడోవంతు దీనిదే..

శబరిమలై అయ్యప్ప స్వామివారి మాలధారణ సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొంత మంది భక్తులు మాల వేసుకున్నారు. అయితే శబరిమలలోని స్వామివారి ప్రసాదం గురించి మనకు తెలియనిది కాదు. చాలా మంది ప్రత్యేకంగా తెప్పించుకుని మరీ స్వీకరిస్తారు. శబరిమలై వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని వారు ప్రసాదంతో ఆనందపడుతూ ఉంటారు. అయితే స్వామివారి ప్రసాదాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రసాదం.. అరవణ పాయసం. ఈ ప్రసాదం ప్రత్యేకతే వేరు.

రుచిలో గానీ.. పరిమళంలో గాని అరవణ పాయసానికి అదే సాటి. అన్నం, బెల్లం, కొబ్బరి పాలతో అరవణ పాయసాన్ని తయారు చేస్తారు. శబరిమలై ఆలయం ద్వారా ట్రస్టుకొచ్చే ఆదాయంలో మూడో వంతు ప్రసాదం అమ్మకాల నుంచే వస్తుందంటే అతిశయోక్తి కాదు. అంత పెద్ద మొత్తంలో ప్రసాదాల విక్రయం జరుగుతుంది. మకర జ్యోతి సీజన్‌లో అయితే అత్యధికంగా ప్రసాద విక్రయం జరుగుతుంది. రోజుకు సగటున 3 లక్షల డబ్బాల అయ్యప్ప ప్రసాదం అమ్ముడౌతోంది. శబరిమలై అనగానే అయ్యప్పస్వామి తర్వాత వెంటనే మనకు గుర్తొచ్చేది అరవణ పాయసమే.

Share this post with your friends