తిరుమలలో ఆగ‌స్టు 7వ తేదీన పురుశైవారి తోట ఉత్సవం

శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి తిరువడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని ఆగ‌స్టు 7వ తేదీన తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరుగనుంది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు.

ఈ పవిత్రమైనరోజు సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేస్తారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు బయల్దేరి పొగడ చెట్టు వద్దకు రాగానే హారతి ఇస్తారు. హారతి, పుష్ప మాల‌, శ్రీ శఠారి పొగడ చెట్టునకు సమర్పిస్తారు. శ్రీ శఠారికి అభిషేకం అనంతరం తిరిగి తిరుచ్చిపై ఉంచుతారు. అక్కడ నుంచి స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు.

Share this post with your friends