అయ్యప్ప స్వామి.. ధర్మశాస్తాగా అవతరించినప్పుడు పూర్ణ, పుష్కళలను వివాహం చేసుకున్నాడు. పూర్ణ, పుష్కళలు.. సత్యపూర్ణుడు అనే మహర్షి నేత్రాల నుంచి ఉద్భవించిందట. వారు యుక్త వయసు వచ్చాక ధర్మశాస్తాను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుని దాని కోసం భక్తి ప్రపత్తులతో అందుకు తగిన వ్రతాన్ని చేశారట. ఆ వ్రత ప్రభావంతోనే స్వామిని భర్తగా పొందారనేది పురాణ కథనం. అయితే పూర్ణ, పుష్కళలతో పాటు స్వామివారికి మరో భార్య కూడా ఉందట. ఆమె పేరే ప్రభావతి. వీరిద్దరికీ సత్యకన్ అనే పుత్రుడు ఉన్నాడని పురాణాల్లో ఉంది. అంతేకాకుండా శబరిమల ఆలయంలో స్వామివారి పవళింపు సేవలో భాగంగా ‘ప్రణయ సత్యకా స్వామి ప్రాణనాయకం’ అను పదాలే ఇందుకు నిదర్శమట.
అయితే ఈ విషయంలో వైదిక ధర్మం మాత్రం మరొకలా చెబుతోంది. భార్య అనే పదానికి మరో అర్దం చెబుతోంది. భార్య అన్న శబ్దానికి అర్థం నిజంగా మహిళ పక్కన ఉండటం కాదట. పురుషుడిని ఆశ్రయించిన శక్తి అతనితో ఉండటాన్ని స్త్రీ రూపంగా సంకేతంగా చెబుతారు. ఏ శక్తి రూపాన్ని ఆరాధాన చేసినా ఇదే చెబుతారు. అంతేకాకుండా ‘శ్రీ’కారం ఎక్కడ ఉంటే అక్కడ శక్తి పూజ అక్కడ ఉంటుందని అర్ధమట. ఈ ప్రకారం.. పూర్ణ, పుష్కళను అయ్యప్ప స్వామి భార్యలుగా కాకుండా ఆయనకున్న శక్తులుగా పేర్కొంటారు. ఆయనకున్న రెండు శక్తులే పూర్ణత్వమం.. పుష్కళత్వం అని చెబుతారు. పూర్ణత్వమంటే నిండుగా ఉండటం. ఎంతమంది వచ్చినా ఇచ్చేంత ఉండటమే పుష్కళత్వమట.