వేములవాడ రాజన్న దర్శించుకున్న ప్రధాని మోదీ

తెలంగాణలోని వేములవాడ దక్షిణ కాశీగా పిలువబడుతోంది. రాజన్న జిల్లాలోని ఈ క్షేత్రాన్ని ఇవాళ (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. స్వామివారికి కోడె మొక్కులు చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీకి ఆలయ పూజారులు మోదీకి సాదర స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందజేశారు. ఆలయంలోని భక్తులకు ప్రధాని అభివాదం తెలిపారు. నరేంద్ర మోదీ ఉదయం రాజ్ భవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో వేములవాడకు చేరుకున్నారు. రాజన్నను దర్శించుకున్న తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు.

రాజ రాజేశ్వర స్వామిని దర్శించుకోవడం తన అృష్టమని మోదీ తెలిపారు. ఈ దేవాలయంలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేతుడై రాజరాజేశ్వరుడు లింగరూపంలో నిత్యం పూజలు అందుకుంటున్నాడు. భాస్కర క్షేత్రంగా, హరిహర క్షేత్రంగా పిలవబడే ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో చెప్పబడింది. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపటం వల్ల కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకోడానికి దేశాటన చేస్తూ వేములవాడకు చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణం చెబుతోంది.

Share this post with your friends