నేడు ప్రారంభమైన పెద్దాపురం మరిడమ్మ జాతర

చల్లనితల్లి.. మా కల్పవల్లి అంటూ పెద్దాపురం మరిడమ్మను భక్తులు పెద్ద ఎత్తున కొలుస్తారు. తెలుగురాష్ట్రాల్లో అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఆలయాల్లో పెద్దాపురం మరిడమ్మ ఆలయం ఒకటి. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా మరిడమ్మను భక్తులు కొలుస్తారు. అమ్మవారి జాతర మహోత్సవాలు ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నేటి నుంచి అమ్మవారి జాతర ప్రారంభమైంది. ఈ జాతర ముప్పై ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు.

ఈ మరిడమ్మ అమ్మ వారి జాతర ప్రతీ సంవత్సరము జేష్ఠ మాసంలోని అమావాస్య నుంచి ప్రారంభమై ఆషాడ మాసంలోని అమావాస్య వరకూ 37 రోజుల పాటు అత్యంత వైభవముగా జరుగుతుంది. రాష్ట్రం నలుమూలల నుంచి మరిడమ్మ అమ్మ వారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తూంటారు ఒక్క ఆదివారం రోజునే దాదాపు 40 నుండి 50 వేల మంది వరకూ భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ చెబుతోంది. ఈ అమ్మవారిని సామర్లకోట చింతపల్లివారి ఆడపడుచుగా స్థానికులంతా పేర్కొంటారు.

Share this post with your friends