సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో ప్రారంభమైన ప‌విత్రోత్స‌వాలు

సత్రవాడ కరివరదరాజస్వామి ఆలయంలో ప‌విత్రోత్స‌వాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రోత్సవాలకు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణంతో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఇవాళ ఉదయం 7.30 గంట‌ల‌కు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కూ స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.

ఉద‌యం 11 గంటల‌కు పవిత్ర సమర్పణ, సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వ‌ర‌కు స్వామి, అమ్మవార్ల వీధి ఉత్స‌వం నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 7.30 గంటలకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. ఇలాంటివి యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరగడం సర్వసాధారణం. వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ప్రతి ఏడాది పవిత్రోత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు.

Share this post with your friends