Tirupati : జూలై 06 నుండి 09వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

తిరుపతి (Tirupati) శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం (Sri Kapileswara Swamy Temple) లో జూలై 06 నుండి 09వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు (Pavithrotsavam) జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూలై 06న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ (Ankurarpana) నిర్వహిస్తారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

* ఇందులో భాగంగా జూలై 07న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌ తిరుమంజ‌నం (Snapana Tirumanjanam), ‌సాయంత్రం క‌ల‌శ‌పూజ‌ (Kalasa Pooja), హోమం (Homam), ప‌విత్ర ప్ర‌తిష్ఠ నిర్వ‌హిస్తారు.

* జూలై 08న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌, ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు.

* జూలై 09న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి (Maha Purnahuti), క‌ల‌శోధ్వాస‌న‌, ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హిస్తారు. ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన శ్రీ కపిలేశ్వర స్వామి (Sri Kapileswara Swamy), శ్రీ కామాక్షి అమ్మవారు (Sri Kamakshi Ammavaru), శ్రీ విఘ్నేశ్వర స్వామి (Sri Vigneswara Swamy), శ్రీ సుబ్రమణ్య స్వామి (Sri Subrahmanya Swamy), శ్రీ చండికేశ్వర స్వామివార్లు (Sri Chandikeshwara Swamy) పుర వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Share this post with your friends