శ్రీహరిని ఆరాధిస్తే వారి యోగ క్షేమాలు ఆయనే చూసుకుంటాడట..

మాదవపురం అనే చిన్ని పట్నంలో నిరుపేద కుటుంబం నడకదారి పక్కన చిన్న గుడిసె వేసుకొనే ఒక కుటుంబం జీవించేది. ఆ కుటుంబంలోని ఇంటి ఇల్లాలు మంచి శ్రీహరి భక్తురాలు. వారు బాట పక్కన చిన్ని బొమ్మలు, గాలి బుడ్డలు అమ్మి బతికేవారు. అది వారి జీవనం.కానీ ఆ ఇంటి ఇల్లాలు మాత్రం నిత్యం శ్రీహరిని పూజ చేస్తేగాని ఏ పని చేయదు. అంతటి భక్తురాలు ఆమె. ఆమెకి ఇద్దరు సంతానం. ఒకరోజు వారి వ్యాపార నిమిత్తం ఆమె భర్త బొమ్మలు అమ్ముతూ మరణించాడు. ఆ కుటుంబం భారం మొత్తం ఆమె మీద పడింది. అయినను ఆమె హరి పూజను విడువలేదు. తరువాత ఆమె నివసిస్తున్న గుడిసెను దారికి అడ్డు అని తొలగించారు.

శ్రీహరిని ఆరాధిస్తే వారి యోగ క్షేమాలు ఆయనే చూసుకుంటాడట..
శ్రీహరిని ఆరాధిస్తే వారి యోగ క్షేమాలు ఆయనే చూసుకుంటాడట..

చూడండి ఎంత కష్టం వచ్చినను శ్రీహరిని పూజను విడిచిపెట్టాడు కాదు. ఆమె పెద్ద బిడ్డ అమ్మ నువ్వు శ్రీ మహావిష్ణువుని పూజిస్తున్నారు ఏమి లాభం మనకు కష్టాలు పోలేదు కదా.. ఎక్కువ వచ్చాయి. ఆ పూజను మాను అమ్మ అని చెప్పెను. అందుకు ఆమె నయన శ్రీహరి సర్వాంతర్యామి, జగతుకు తండ్రి దయామయుడు. తన భక్తులను ఎప్పటికైనా కాపాడుతాడు. ఇప్పుడు ఉన్న కష్టం మనము చేసుకున్న కర్మ ఫలమే. అలా ఒకరోజు బొమ్మలు అమ్ముతున్న ఆమె నడక దారిలో ఒక సంపన్నరాలు అయిన ఒక ముసలావిడ ఆ దారిలో పోతూ కింద పడిపోయింది. ఆమెకు ఎవ్వరూ సహాయం చేయలేదు. ఈ హరి భక్తురాలు సహాయం చేసింది. ఆమెను వైద్యశాలకు తీసుకెళ్ళింది. ఆమెకు సేవ చేసి కాపాడింది. ఆ సంపన్నరాలికి పిల్లలు లేరు. కాపాడిన దానికి ఆ సంపన్నురాలు ఈ హరి భక్తురాలిని చేరదీసి తన ఇంటిలోనే ఉంచుకున్నది. శ్రీహరి నమ్మినందుకు ఎక్కడ ఉన్న వారిని ఎక్కడికో తీసుకెళ్ళాడు. ఎవ్వరైనా తనను పూజిస్తే వారి యోగక్షేమాలు శ్రీహరి చూసుకుంటాడు.

Share this post with your friends