ఓనం పండుగ ప్రారంభం.. సంబరాల్లో మలయాళీలు..

కేరళలో అతి ముఖ్యమైన పండుగలలో ఓనం ఒకటి. ఈ పండుగను కేరళలో అతి ముఖ్యమైన పండుగ. మలయాళీలు పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. ఆగస్ట్ – సెప్టెంబర్ మాసాల్లో ఈ పండుగ వస్తూ ఉంటుంది. ఈ పండుగను కూడా వినాయక చవితి మాదిరిగానే పది రోజుల పాటు జరుపుకుంటూ ఉంటారు. ఈ పండుగ ‘తిరువోణం’తో ముగుస్తుంది. ముఖ్యంగా బలి చక్రవర్తిని భూమి మీదకు స్వాగతిస్తూ కేరళ మొత్తం ఈ పండుగను వైభవంగా జరుపుకుంటుంది. ఈ పండుగను ముఖ్యంగా ఐక్యతతో పాటు సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి ప్రతీకగా జరుపుకుంటారు.

పండుగ సందర్భంగా మలయాళీలంతా సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. ఇంటి ఆవరణను రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఈ సందర్భంగా సద్య అనే ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేస్తారు. ఇక భోజనంలో వచ్చేసి దాదాపు 26 రకాల ఫుడ్స్ ఉంటాయి. బంధుమిత్రులంతా ఒక చోట చేరి అరిటాకులో రకరాల ఫుడ్స్‌తో విందు భోజనం చేస్తారు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ సమయంలో ‘నౌకా వల్లం’ లేదా బోట్ రేస్ నిర్వహిస్తారు. ఈ బోటు రేస్‌లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారు. ఈ పది రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రజలు సంబరాల్లో పాల్గొంటారు.

Share this post with your friends