గుమ్మడికాయను ఏ రోజున, ఏ సమయంలో కట్టాలి?

ఎలాంటి గుమ్మడికాయను ఇంటి ముందు లేదంటే దుకాణం ముందు కట్టాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ రోజున.. అలాగే ఏ సమయంలో కట్టాలో తెలుసుకుందాం. గుమ్మడికాయను ఎప్పుడు పడితే అప్పుడు ఇంటి ముందు వేలాడదీయకూడదు. ఇది కట్టేందుకు ప్రత్యేక సమయం ఉంటుంది. ముఖ్యంగా బూడిద గుమ్మడికాయను అమావాస్య నాడు కడితే మంచిదట. ఆ రోజున కడితే ఫలితం చాలా బాగుంటుందట. నరదిష్టితో పాటు కనుదిష్టి కూడా తొలగిపోతుందట.

కొందరికి అమావాస్య నాడు కట్టేందుకు వీలు పడకపోవచ్చు. అలాంటి వారు బుధవారం లేదా శనివారం నాడు కట్టాలట. ఇక ఏ రోజున కట్టినా కూడా సూర్యోదయానికి ముందే గుమ్మడికాయను కట్టాలట. ఇలా చేస్తే ఫలితం బాగుంటుందట. సూర్యోదయం తరువాత కడితే అంత ప్రయోజనం ఉండదట. పైగా మిశ్రమ ఫలితాలుండే అవకాశం ఉంటుందట. బూడిద గుమ్మడికాయను ఇంటి ముందు కట్టడానికి ముందు ఒక పెద్ద ప్లేటులోకి తీసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆపై ఇంటి ముందు కట్టాలి.

Share this post with your friends