అయోధ్య బాల రామయ్యకు మామిడి పండ్ల నైవేద్యం.. ఫోటోలు నెట్టింట వైరల్..

అయోధ్య రామాలయ నిర్మాణానంతరం హిందువులు చాలా సంతోషించారు. కొన్ని దశాబ్దాల నాటి కల నెరవేరినందుకు హిందువుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయోధ్యలో ప్రతిష్టించిన బాల రామయ్యకు ఏ అకేషన్ అయినా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే రాముడి ఆలయం అయోధ్యలో నిర్మించారు. అంతే భక్తి శ్రద్ధలతో భక్తులు నిత్యం పెద్ద ఎత్తున వెళ్లి బాల రామయ్యను దర్శించుకుని వస్తున్నారు. బాల రామయ్యకు సంబంధించి నిత్యం ఏవో ఒక ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కూడా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా అక్షయ తృతీయ జరిగిన విషయం తెలిసిందే. దీనిని హిందువులంతా పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ క్రమంలోనే బాల రామయ్య ఆలయంలో కూడా ఓ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. అక్షయ తృతీయ సందర్భంగా బాల రామయ్యకు నైవేద్యంగా సీజనల్ ఫ్రూట్ అయిన మామిడి పండ్లను పెట్టారు. అవి ఒక డజనో రెండు డజన్లో పెడితే చెప్పుకోవాల్సిన పని లేదు కానీ బుట్టల కొద్దీ రూమ్ అంతా మామిడి పండ్లను పెట్టారు. అలాగే డ్రాగన్, కివి, ద్రాక్ష, మామిడి పండ్ల జ్యూస్‌ బాటిళ్లను రామయ్య ముందు పెట్టారు. అంతేకాకుండా బాలరామయ్య ఆలయాన్ని మామిడి తోరణాలతో అలంకరించి.. స్పెషల్ అట్రాక్షన్‌గా మామిడి పండ్లను వేలాడదీశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Share this post with your friends