దీపం జ్యోతిః పరంబ్రహ్మ సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే
కార్తికంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా, మరొకరు వెలిగించిన దీపాన్ని కాపాడినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తికం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా, శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏకబిల్వం శివార్పణం అంటూ కార్తికంలో ఒక్కమారేడు దళాన్నెనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశ్శివాయ చెబుతూ కాసిన్ని నీళ్లు శివలింగంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి, భుజించ గలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ ఈ నెలరోజుల్లో ఒక్కరోజైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు. సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం… సాధుసత్పురుషులను దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తికమే అందిస్తుంది.
Click Here For November 2024 Bhakthi Magazine Online Edition
కార్తికంలో ప్రతి ఏటా హైదరాబాద్ నగరంలో కోటిదీపోత్సవాన్ని భక్తిటీవీ ఒక సత్సంప్రదాయంగా నిర్వహిస్తోంది. 2012లో ప్రారంభించిన దీపోత్సవం తెలుగువారికి అభిమాన కార్యక్రమంగా రూపుదాల్చడం మాకు మహాదేవుడు అందించిన వరంగా భావిస్తున్నాం. వివిధ క్షేత్రాలనుంచి ఉత్సవ మూర్తులను వేదికపైకి తీసుకువచ్చి కల్యాణాలు నిర్వహిస్తున్నాం. సత్పురుషుల సన్నిధిలో కోటిదీపాలు ఒకే ప్రాంగణంలో వెలిగేలా చేస్తున్నాం. మహాదేవునికి నృత్య, గీత నీరాజనాలు సమర్పిస్తున్నాం. ఇటువంటి వేడుక న భూతో న భవిష్యతి అన్నంతగా పేరు ప్రఖ్యాతులు ఆర్జించింది. దీనివెనుక అశేష భక్తజనులు దీవెనలున్నాయి. ఈ ఏడాది కూడా….ఈ సత్సంప్రదాయాన్ని 2024 నవంబర్ 9 నుంచి 25 వరకు… హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ వేదికగా ప్రతిరోజూ సాయంత్రం 5.30 నుంచి నిర్వహించనున్నాం. భక్తకకోటి అశేషంగా తరలివచ్చి మహాదేవుని ఆశీస్సులను పొందాలని కోరుతున్నాం.
ఇలా అనేక అంశాలతో నవంబర్ ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.
ఇక్కడ క్లిక్ చేయండి.. నవంబర్ ఆన్లైన్ భక్తి పత్రికను పొందండి..!