స్త్రీ గురించే కాదు.. పురుషుడు ఎలా ఉండాలో కూడా చెప్పిన ధర్మశాస్త్రం.. ఎలాగంటే..

స్త్రీ ఎలా ఉండాలో అనే కాదు.. పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మశాస్త్రం చెప్పింది. కానీ ఆ పద్యం ఎందుకోగానీ జన బాహుళ్యంలోకి రాలేదు. కామందక నీతిశాస్త్రంలో పురుషుడు ఎలా ఉండాలనేది చెప్పడం జరిగింది. ‘కార్యేషు యోగీ, కరణేషు దక్షః, రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః’ అని చెప్పారు. అంటే ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

1. కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి

2. కరణేషు దక్షః : కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడైఉండాలి.

3. రూపేచ కృష్ణః: రూపంలో కృష్ణుని వలే ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి.

4. క్షమయా తు రామః: ఓర్పులో శ్రీ రామునిలాగా ఉండాలి. పితృ వాక్య పరిపాలకుడైన శ్రీరాముని వలె క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి.

5. భోజ్యేషు తృప్తః: భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకుండా)భుజించాలి.

6. సుఖ దుఃఖ మిత్రం: సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలి.

ఈ షట్కర్మలు అంటే ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ పురుషునిగా, ధర్మనాథునిగా కొనియాడ బడతాడు.

Share this post with your friends