బాలాపూర్ లడ్డూ వేలంలో కొత్త నిబంధన.. పోటీ ఎవరెవరి మధ్యంటే..

గణపతి నిమజ్జనానికి వేళైంది. ప్రస్తుతం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం, బాలాపూర్ లడ్డూపైనే అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. బాలాపూర్ లడ్డూ వేలం పాట మొదలై 30 ఏళ్లవుతోంది. ఈసారి ఎంత ధర పలుకుతోందనన్న చర్చ సర్వత్రా ప్రారంభమైంది. ఈ వేలంలో ఈసారి ఎవరెవరు పాల్గొననున్నారు? అనే విషయాలను తెలుసుకుందాం. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.27 లక్షలు పలికింది. ఈసారి బాలాపూర్ లడ్డూ వేలం పాటలో కొత్త నిబంధన వచ్చి చేరింది. ఈసారి రూ.27 లక్షలు ధరావత్తుగా కట్టిన వారి పేరే బాలాపూర్ లడ్డూ వేలంలో ఉంటుంది.

ఇంతకు ముందు స్థానికేతరులకు మాత్రమే ఈ నిబంధన ఉండేది. ఈసారి స్థానికులకు కూడా ఇదే రూల్ వర్తింపజేశారు. బాలాపూర్ లడ్డూకి విపరీతమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చారు. బాలాపూర్ లడ్డూ ఈసారి రూ.30 లక్షలు పలుకుతుందని అంచనా వేస్తున్నారు. మరి ఈ లడ్డూ దక్కించుకోవడానికి రూ.27 లక్షల డిపాజిట్ ఎవరెవరు కట్టారో తెలుసా? ప్రధానంగా నలుగురి మధ్య బాలాపూర్ లడ్డూ వేలంలో పోటీ నెలకొననుంది.

పోటీ ఎవరెవరి మధ్యంటే..

లక్ష్మీనారాయణ- శ్రీ గీతా డైరీ, నాదర్గుల్ః

ప్రణీత్ రెడ్డి, సాహెబ్ నగర్- అర్బన్ గ్రూప్

లింగాల దశరథ్ గౌడ్ -చైతన్య స్టిల్స్..

కొలను శంకర్ రెడ్డి – బిజేపీ సీనియర్ లీడర్, బాలాపూర్

Share this post with your friends