తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం, శ్రీ కోదండరామస్వామివారి ఆలయాల్లో గురువారం దీపావళి సందర్భంగా శాస్త్రోక్తంగా ఆస్థానం నిర్వహించారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో….
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ పుండరికవళ్ళి అమ్మవారి ఆలయం నుంచి సాయంత్రం నూతన వస్త్రాలు, దీపాలు తీసుకువచ్చి బాలాలయంలోని స్వామివారికి సమర్పించారు. అనంతరం దీపావళి ఆస్థానం నిర్వహించారు.
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో….
శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో దీపావళి సందర్భంగా గురువారం రాత్రి దీపావళి ఆస్థానం ఘనంగా నిర్వహించారు. దీపావళి సందర్భంగా గురువారం రాత్రి 7 గంటలకు తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి నూతన వస్త్రాలు, దోశపడి, దీపాలు తీసుకువచ్చి శ్రీకోదండరామస్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా అమావాస్యనాడు ఆలయంలో నిర్వహించే సహస్ర కలశాభిషేకంసేవ, హనుమంత వాహనసేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవోలు శ్రీమతి శాంతి, శ్రీమతి నాగరత్న, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.