నేటి నుంచి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు..

ఇవాళ్టి నుంచి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకూ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటలకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, ఇతర పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

అదేవిధంగా రాత్రి 7 గంటలకు ఊంజల్‌సేవ నిర్వహిస్తారు. అక్టోబరు 12వ తేదీ విజయదశమినాడు రాత్రి 7:45 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు విశేషమైన గజ వాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. ఇక ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలను రద్దు చేస్తారు. న‌వ‌రాత్రి ఉత్స‌వాల కార‌ణంగా ఈ 10 రోజుల పాటు క‌ల్యాణోత్స‌వం సేవను ర‌ద్దు చేయ‌డ‌మైన‌ది. అదే విధంగా.. అక్టోబరు 4, 11వ తేదీలలో ల‌క్ష్మీపూజ‌, అక్టోబరు 12న ఊంజల సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది.

Share this post with your friends