నామక్కల్ హనుమాన్.. ఈయన ప్రత్యేకతేంటో తెలిస్తే షాకవుతారు..

రామభక్త హనుమాన్ హిందువులందరికీ ఆరాధ్య దైవం. ఒక్క హనుమంతుడిని.. ఎందరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా? సీతారామలక్ష్మణులతో పాటు శివుడు, శనీశ్వరుడు అందరి అనుగ్రహం లభిస్తుంది. అందుకే ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరు అంటూ మన దేశంలో దాదాపుగా ఉండదు. హనుమంతుడికి చెందిన కొన్ని ఆలయాలు చాలా ప్రసిద్ధిగాంచాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన దేవాలయం ఒకటి తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లాలో ఉంది. నామక్కల్ హనుమాన్ ఆలయ విశేషాలేంటి? ఈ ఆలయం ఎందుకంత ప్రఖ్యాతిగాంచిందో తెలుసుకుందాం.

తమిళనాడులోని నామక్కల్ జిల్లాలోని నామక్కల్ కొండ దిగువన కొలువుదీరాడీ ఆంజనేయుడు. ఈయన ప్రత్యేకత గురించి తెలిస్తే షాకవుతారు. నామక్కల్‌లో నిలువెత్తు రూపంలో భక్తుల పూజలందుకుంటున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ హనుమంతుడి ప్రత్యేకత ఏంటంటే.. రోజురోజుకూ పెరుగుతూ ఉంటాడు. అందుకే ఈ ఆలయానికి పైకప్పు కూడా ఉండదు. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఒకవేళ పైకప్పు నిర్మించేందుకు ఎవరైనా యత్నించినా కూడా అది కూలిపోవడమో.. లేదంటే మధ్యలోనే ఆగిపోవడమో జరిగేదట. అందుకే అక్కడి వారు ఆ ఆలోచననే విరమించుకున్నారు.

Share this post with your friends