
తమిళనాడు రాష్ట్రంలోని తిలతర్పణపురి అనే గ్రామంలో కొలువుదీరిన నరముఖ గణపతి గురించి ఇప్పటికే ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. ప్రతి మాసంలో పౌర్ణమి తరువాత వచ్చే సంకష్ట హర చతుర్థి నాడు మహా గురువు అగస్త్యుడు స్వయంగా వచ్చి వినాయకుడికి పూజలు నిర్వహిస్తాడట. ఇక ప్రతి గురువారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ముఖ్యంగా భారతదేశంలో కాశీ, రామేశ్వరం, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా ఈ నరముఖ గణపతి ఆలయాన్ని చూస్తారు. ఇది కూడా నరుడి రూపంలో ఉన్న గణపతి కారణంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
ఈ ఆలయానికి సంబంధించి మరో విశేషం కూడా ఉంది. విద్యకు ఆది గురువుగా భావించే ఈ వినాయకుని సన్నిధిలో దాదాపు 85 సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి ఏటా అత్యంత వైభవంగా సంగీత ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి సంవత్సరం సంగీత ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ వార్షిక సంగీత ఉత్సవాల్లో ప్రముఖ సంగీత విధ్వాంసులు ఎందరో పాల్గొన్నారు. ఈ గణపతిని పూజిస్తే కుటుంబ సంబంధాల్లో ఎలాంటి కలతలూ ఉండవట. విద్యార్థులకైతే బుద్ధిబలం, తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. ఈ ఆలయంలో తమిళనాడులోని సరస్వతి ఆలయానికి 3కి.మీ దూరంలో ఉంటుంది.
