ఫిబ్రవరిలో మీనరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని తెలుసుకున్నాం కదా.. అప్పుడు రాహు, బుధుడి కలయిక కూడా ఏర్పడనుంది. ఈ కలయికతో మూడు రాశుల వారికి విశేష ఫలితాలు కలగనున్నాయి. ఆ మూడు రాశులేంటో తెలుసుకుందాం. వృషభరాశివారికి నూతన సంవత్సరంలో కొత్త అవకాశాలు లభించనున్నాయి. కెరీర్ అద్బుతంగా ఉండబోతోందట. తద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు చేసే వారికి సైతం ఫిబ్రవరిలో అద్బుతంగా ఉండనుంది. ఆర్థిక పురోగతికి అనేక అవకాశాలు లభించడంతో పాటు విదేశాల్లో పని చేసే ఉద్యోగస్తులు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి.
తులా రాశి వారికి నూతన సంవత్సరంలో రాహువు, బుధుడి కలయిక వలన తుల రాశి వారికి అద్భుతంగా ఉండబోతోందట. ఈ సమయంలో కెరీర్‌లో ఎదుగుదలకు అనేక అవకాశాలు లభించనున్నాయి. ముఖ్యంగా పరిశోధన, సాంకేతిక పనులలో విజయంతో పాటు.. వ్యాపారానికి సంబంధించి ఈ రాశివారు ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నా.. సత్ఫలితాన్నిస్తాయట. వృశ్చిక రాశి వారికి సైతం కొత్త సంవత్సరంలో ఏర్పడిన రాహు, బుధ గ్రహాల కలయిక వలన మంచి జరుగుతుందట. వ్యాపారంలో బాగస్వామ్యం కలిసొస్తుందట. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయట. ఈ మూడు రాశుల వారు నూతన సంవత్సరంలో మంచి జీవితాన్ని గడపబోతున్నారట.