చూసి రమ్మంటే కాల్చి వచ్చే దక్షతగల కార్యశీలి హనుమంతుడు. అపరిమిత శక్తి సంపన్నుడే కాకుండా గొప్ప మాటకారిగా కూడా పేరు తెచ్చుకున్నాడు. చిరంజీవిగా, విశిష్టదైవంగా దివ్యకీర్తిని పొందాడు. హనుమంతుని శరణువేడితే అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. హనుమంతుడు నిష్ఠకు, సేవా పరాయణత్వానికి ప్రతీక. ఆయనను సేవిస్తే సకల భోగాలనూ అనుగ్రహిస్తాడని ప్రతీతి. హనుమజ్జయంతి శుభవేళ (మే22) ఆ శ్రీరామదూతకు జయము పలుకుదాం. కోరిన వెంటనే భక్తులకు అన్ని వరాలనూ అనుగ్రహించే దైవం నృసింహుడు. మే 10న సృసింహ జయంతి సందర్భంగా ఆ స్వామికి కైమోడ్చుదాం. చల్లగా చూడమని వేడుకుందాం.
Click Here For November 2024 Bhakthi Magazine Online Edition
అన్నవరం సత్యదేవుడు భక్త సులభుడు. చిన్నవ్రతంతో కోరిన వరాలు కురిపిస్తాడు. ఆయన తెలుగువారికి ఇలవేలుపు. మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వెనువెంటనే సత్యనారాయణస్వామి వ్రతం చేసుకుంటాం. అటువంటి సత్యదేవుడు వెలిసిన అన్నవరంలో శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం 8వ తేదీన జరగనుంది. అందులో పాల్గొని ఆ స్వామి కృపకు పాత్రులమవుదాం. అద్వైతమూర్తి ఆదిశంకరాచార్యుని జయంతి (మే 2) వైశాఖమాసానికి వన్నె తెస్తుంది. సమతామూర్తి రామానుజుని పుట్టినరోజు కూడా అదే రోజు రావడం విశేషం. లోకానికి అహింసా మార్గాన్ని బోధించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన జయంతి బుద్ధపూర్ణిమ మే 12 సందర్భంగా ఆయన ప్రబోధాలను నెమరేసుకుందాం. రాశిచక్రంలో గురుడు రాశి మారినప్పుడల్లా మన పుణ్యనదులకు పుష్కరాలు వస్తుంటాయి. మే 15 నుంచి 26 వరకు సరస్వతీనదికి పుష్కరాలు రానున్నాయి. పుష్కరాల విధులను మన తెలుగువారు తప్పక పాటిస్తుంటారు. ఆ పుణ్యసమయంలో నదీస్నానం, దానాలు చేస్తుంటారు. మనదేశంలో సరస్వతీనది ఎండిపోయినప్పటికీ… కొన్నిచోట్ల ఆ నది ఆసవాళ్లు గుర్తించారు. తెలంగాణలోని కాళేశ్వరంతో పాటుగా ఆయా ప్రదేశాల్లో పుష్కరాలు జరగనున్నాయి. సరస్వతీ పుష్కరాల సందర్భంగా ఆ నదీమ తల్లి మనల్ని కరుణించాలని వేడుకుందాం.
Bhakthi Magazine May 2025 Highlights
➠ రుద్రాంశ సంభూతుడు… పరమ రామభక్త శిఖామణి ఆంజనేయుడు. ఆయన ఒక్కడే అయినా కోరినవారికి కోరిన రూపాన దర్శనమిస్తాడు. తలచిన వారికి తలపులలోని అభీష్టాలను సిద్ధింప చేస్తాడు. ఆర్తితో పిలిచేవారికి ఆపన్నవరద హస్తం అందించే సులభసాధ్యుడైన దైవం ఆంజనేయస్వామి. హనుమజ్జయంతి మంగళవేళ ఆయన రూపాలలో అత్యంత మహిమాన్వితం అయిన పంచముఖాంజనేయ తత్త్వాన్ని స్మరించుకుందాం.
➠ ఉత్సవమంటే ఉత్కృష్టమైన రసాన్ని పిండుకోవటమని అర్థం. జయంత్యుత్సవం నాడు విశిష్టులైన గుణకర్మలను విశ్లేషించుకోవాలి. వాటిని సాధ్యమైనంత వరకు అనుసరిస్తూ, అనుకరించడానికి ప్రయత్నించాలి. ఆ మహానుభావుణ్ణి గుర్తు చేసుకొని, మహదానందరసాన్ని పిండుకొని ఆస్వాదించే సమయం జయంతి. ఉగ్రత్వం ఉట్టిపడే నరసింహస్వామి అవతారం వెనుక ఎన్నో యోగరహస్యాలున్నాయి.
➠ అద్వైతం అంటే రెండుకానిది అని అర్థం. ఆత్మభావనలో ‘త్వమేవాహం… నీవే నేను’ అనే అద్వైత సూత్రం మనం సంప్రదాయంలో అనాదిగా ఉంది. దానినే శుకమహర్షి శిష్యులైన గౌడపాదాచార్యులు ఉపనిషత్తుల ఆధారంగా నిరూపించారు. గౌడపాదులు శిష్యులు గోవిందులు కాగా, గోవింద భగవత్పాదుల శిష్యులు ఆదిశంకరులు. ఆయనే అద్వైత మార్గాన్ని మరింతగా విస్తరించారు. సామాన్యులకు సైతం చేరువ చేశారు. శంకర సాహిత్యం అపారంగా లభిస్తోంది. ఆయన రచించిన స్తోత్రాలు, భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు నేటికీ ప్రజల నాలుకలపై నర్తిస్తూనే ఉన్నాయి. అద్వైత భాస్కరునిగా శంకరులు ప్రసరించిన వెలుగు కిరణాలు మన ధర్మాన్ని నడిపిస్తున్నాయి. ‘శంభోర్మూర్తి: చరతి భువనే శంకరాచార్య రూపా’ అన్న సూక్తిని ఆయన నిజం చేశారు.
➠ రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. దీనజనుల పక్షాన నిలిచి, సమతామూర్తిగా పేరు తెచ్చుకున్నారు. వైష్ణవ మత వ్యాప్తికి రామానుజులు చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. శ్రీరంగం, కంచి, తిరుమల, మేల్కోటే తదితర ఆలయాల్లో ఆయన చేపట్టిన సంస్కరణలు చెప్పుకోదగినవి. ఆయన ప్రబోధించిన జీవాత్మ పరమాత్మలకు ప్రకృతిని అనుసంధాన కర్తగా భావిస్తూ ఆయన రూపొందించిన విశిష్టాద్వైత సిద్ధాంతం అనుసరణీయం.
➠ పోతులూరి వీరబ్మహ్మేంద్ర స్వామి 17వ శతాబ్దంలో జీవించిన మహాగురువు. ఆయన కాలజ్ఞాన తత్వాలు అందరికీ సుపరిచితాలే. వీరబ్రహ్మేంద్రస్వామి కులజాడ్యాన్ని రూపు మాపడానికి కృషి చేశారు. వివిధ కులాలకు చెందిన వారిని దరిన చేర్చుకుని తన తత్వాన్ని జనంలో ప్రచారం చేశారాయన. సంఘసంస్కర్త అయిన ఆయన తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మకం.
➠ బౌద్ధ సంప్రదాయం ప్రకారం బుద్ధత్వమనేది మానవీయతకు పరాకాష్ఠ. ఆ మానవీయతా శిఖరానికి చేరిన ఎవరైనా బుద్ధుడు కావచ్చు. సిద్ధార్థ రాకుమారుడు ఆవిధంగానే బుద్ధుడయ్యాడు. బుద్ధత్వమనేది పుట్టుకతో సంక్రమించేదికాదు. కులాన్ని, వంశాన్ని, ప్రాంతాన్నిబట్టి వచ్చేదికాదు. సాధనతో సాధించుకునే ఓ మహోన్నత గుణం. ఈ గుణాల్ని మనసా, వాచా, కర్మణా ఆచరించడమే బుద్ధత్వం.
➠ కేదార్ నాథ్ యాత్ర ప్రారంభతేదీ: మే 2, బదరీ యాత్ర ప్రారంభం : మే 4
దేవభూమి అని పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఘరవాల్ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన క్షేత్రాలలో నాలుగు క్షేత్రాలు అతి ముఖ్యమైనవి. గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్, బదరీ నాథ్ అనేవి ఆ నాలుగు క్షేత్రాలు. ఈ నాలుగు క్షేత్రాలను కలిపి చార్ ధామ్ అంటారు. ఈ నాలుగు క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించడాన్ని చార్ ధామ్ యాత్ర అని పిలుస్తారు. ఈ యాత్రకు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
➠ నెమ్మదిగా నడుస్తాడు కాబట్టి శనికి మందుడని పేరు. నవగ్రహాలలో శనిది కర్మాధికారి స్థానం. జీవుల పాపపుణ్యాలకు తగిన ఫలాలను అనుగ్రహిస్తాడు. ఫలితాలను అందించడంలో మాత్రం శని అత్యంత వేగంగా, ప్రభావశీలంగా పనిచేస్తాడు. క్రూర గ్రహాలుగా జ్యోతిశ్శాస్త్రం చెప్పిన శనిగ్రహం అంటే చాలమంది భయపడతారు. ప్రజల్లో శనిదోషాల పట్ల ఉన్న అపోహలు స్వార్ధపరుల చేతిలో మోసపోవడానికి కారణమవుతున్నాయి. నిజానికి శనిప్రభావాలు అందరికీ ఒకేలా వర్తించవు.
➠ నిత్యకల్యాణ వైభవ సంపన్నుడు శ్రీనివాసుడు. ద్వారకా తిరుమలలో ఏటా రెండుసార్లు తిరు కల్యాణ మహోత్సవాలు అదనంగా జరిపించుకుంటాడు. ఆ వేంకటేశుని వైశాఖ తిరు కల్యాణోత్సవాల సందర్భంగా ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చేనెల 2 వరకూ వివిధ అలంకారాలతో, వాహన సేవలతో ద్వారకా తిరుమల క్షేత్రం ఇల వైకుంఠంగా మారుతుంది.
➠ భారతదేశం ఎన్నో పవిత్ర నదులకు పుట్టిల్లు. పంచభూతాల్లో ఒకటైన నీటిని మనం పరమ పవిత్రంగా భావిస్తాం. నదులను పూజిస్తాం. పుష్కరాల పేరిట, కుంభమేళాల పేరిట పవిత్ర నదులకు ఉత్సవాలు జరుపుతాం. ఆ పుణ్యదినాలలో ఆయా నదులలో స్నానం, దానం చేస్తే పితృదేవతలు సైతం తరిస్తారని నమ్ముతాం. ఏడాదికి ఒకసారి ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. అటువంటి నదుల్లో సరస్వతీ నది కూడా ఒకటి. వేల ఏళ్లకిందటే అంతరించి పోయినా అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నదికి బృహస్పతి మిథున సంక్రమణం చేస్తున్న కారణంగా మే 15 నుంచి మే 26 వరకు పుష్కరాలు వస్తున్నాయి.
ఇలా అనేక అంశాలతో మే ఆన్లైన్ భక్తి పత్రిక వెలువడింది. కొన్న వారికి తక్షణమే తమ DASHBOARD లోకి పత్రిక వచ్చేస్తుంది. అందులోని పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. మన సేవలను అందుకుని ఆ దేవతలందరూ మనందరికీ ఆయురారోగ్యాలను, సకల శుభాలను కలిగించాలని వేడుకుందాం.