ఇవాళే మత్స్య జయంతి.. శ్రీహరి మత్స్యావతారం ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే..

శ్రీ మహా విష్ణువు ధర్మసంస్థాపన కోసం పది అవతారాలను దాల్చాడు. వాటిలో మత్స్యావతారం కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమే మత్స్యావతారం. జలావిర్భావానికి సంకేతంగా ఈ అవతారాన్ని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర బహుళ పంచమి నాడు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించాడు. అది ఇవాళే. ఏప్రిల్ 7, మంగళవారం చైత్ర బహుళ పంచమి తిథి ఉంది కాబట్టి ఇవాళే మత్స్య జయంతిని హిందువులంతా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం వెనుక పురాణ గాథను తెలుసుకుందాం.

ఇవాళే మత్స్య జయంతి.. శ్రీహరి మత్స్యావతారం ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే..
ఇవాళే మత్స్య జయంతి.. శ్రీహరి మత్స్యావతారం ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే..

సృష్టి ఆరంభానికి పూర్వం సోమకుడనే రాక్షసుడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్నాడు. అప్పుడు సృష్టి కార్యానికి అంతరాయం కలుగుతోందని బ్రహ్మ దేవుడు కలత చెందాడట. తరువాత విష్ణుమూర్తి వద్దకు వెళ్లి బ్రహ్మదేవుడు వేదాలు అపహరణకు గురైన విషయాన్ని తెలిపాడట. అప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు అభయమిచ్చి మత్స్యావతారం ధరించి సముద్ర గర్భంలోకి ప్రవేశించి అక్కడ దాక్కున్న సోమకుని సంహరించాడట. అనంతరం తన నాలుగు చేతులతో నాలుగు వేదాలు తీసుకువచ్చి బ్రహ్మకు అప్పగించాడట. అదీ శ్రీహరి మత్స్యావతారం ధరించడం వెనుక ఉన్న పురాణ గాథ.

Share this post with your friends