రాత్రివేళ మనోహరంగా మహాకుంభమేళ.. ఫోటోలు వైరల్

మహా కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దాదాపు 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. క్షీరసాగర మథనంలో విష్ణుమూర్తి అమృతబాండం నుంచి నాలుగు చుక్కలు చిలికి భూలోకంలో పడ్డాయట. ఆ నాలుగు ప్రదేశాల్లో మహాకుంభమేళా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 144 ఏళ్లకోసారి ఈ మహాకుంభమేళా జరుగుతోంది. హరిద్వార్‌లోని గంగ, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

మహాకుంభమేళా సమయంలో అక్కడి నదిలోని నీరు అమృతత్వాన్ని సంతరించుకుంటాయట. అందుకే సామాన్య భక్తులతో పాటు దేశ విదేశాల నుంచి నాగ సాధువులు సైతం వచ్చి మహాకుంభమేళాలో స్నానమాచరిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఆ దృశ్యం చూసి తరించాల్సిందే. అంత మనోహరంగా ఉంది. రాత్రిపూట ఆ లైటింగ్ మధ్య త్రివేణి సంగమం ఎంత చూసినా తనివి తీరనంత మహాద్భుతంగా ఉంది. రాత్రి వేళ మహాకుంభమేళాకు సంబంధించిన ఫోటోలు చూసిన వారంతా మాటల్లో చెప్పలేనంత మధురానుభూతికి లోనవుతున్నారు.

Share this post with your friends