వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది ముంబై.. ఆ తరువాత హైదరాబాద్. ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి వరల్డ్ ఫేమస్. వరల్డ్ రికార్డ్ కూడా మన ఖైరతాబాద్ వినాయుడు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తరువాత ఈ ఏడాది తన రికార్డ్‌ను తనే బ్రేక్ చేసుకున్నాడు. 70 అడుగుల మట్టి గణపతి విగ్రహం రూపొందించడమంటే మాటలు కాదు. గత ఏడాది 63 అడుగుల ఎత్తుతో మహా గణపతిని రూపొందించారు. అయితే ఇప్పటికి ఖైరతాబాద్‌లో వినాయకుడిని ప్రతిష్టించడం 70వ ఏడాది కావడంతో 70 అడుగుల ఎత్తుతో రూపొందించారు. అయితే ఈ ఏడాది మహా గణపతి ఒకరోజు ముందుగానే కనువిందు చేస్తున్నాడు.
వినాయక చవితికి ఒకరోజు ముందుగానే భక్తులకు మహా గణపతి దర్శనమిస్తున్నాడు. 70వ ఏటా, 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేష్ రూపొందిన విషయం తెలిసిందే. సప్తముఖ శక్తి మహాగణపతిగా కనువిందు చేస్తున్నాడు. రేపు మొదటి పూజకు కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక పూజల్లో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పాల్గొననున్నారు. ఈ క్రమంలోనే ఖైరతాబాద్‌లో ఉత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవరాత్రులతో పాటు 500 మందితో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.