
భగవాన్ శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి తన రథంపై భూమిపైకి వచ్చాడట. అలా వచ్చి ఒకచోట రథాన్ని నిలిపి రథం అక్కడే కొలువయ్యాడట. అదెక్కడంటే.. కుంభకోణంలో ఉంది. తమిళనాడులోని కుంభకోణాన్ని ఆలయాల నగరంగా పేర్కొంటారు. కుంభకోణంలో శివ, కేశవులకు సంబంధించి అనేక ఆలయాలు ఉన్నాయి. శేషశయనుడు స్వయంగా వెలసిన క్షేత్రం కుంభకోణమని ఆళ్వారుల గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. తిరుపతి, శ్రీరంగం తరువాత అంతటి పుణ్యక్షేత్రంగా శేషశయనుడి క్షేత్రాన్ని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు రంగపాణిగా పూజలందుకుంటున్నాడు.
శేష తల్పంపై శయనిస్తూ వేలాది భక్తులను స్వామివారు ఆశీర్వదిస్తుంటారు. ఇక్కడికి స్వామివారు రథంపై వచ్చారు కాబట్టి ఆలయాన్ని సైతం రథం ఆకారంలోనే నిర్మించారు. ఈ ఆలయాన్ని చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించారు. స్వామివారు కోమలవల్లితో కలిసి దర్శనమిస్తారు. గాలిగోపురం 11 అంతస్థులతో ఉంటుంది. ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఇలా 12 ఏళ్లకు ఒకసారి ఉత్సవం జరిపే 5 ఆలయాల్లో సారంగపాణి ఆలయం ఒకటి. ఈ ఆలయంలోని గోడలపై భరతనాట్యంలోని 108 భంగిమలను చిత్రీకరించారు. శ్రీరంగపట్న, శ్రీరంగం, అప్పలరంగం, పరిమళ రంగనాధుని ఆలయాల తరువాత సారంగపాణి ఆలయం ఉంది.
