తిరుమల ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!

ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రాలలో తిరుమల క్షేత్రం ఒకటి. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు. శ్రీవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. అయితే తిరుమల ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు.. ఎన్నో రహస్యాలు, అద్భుతాలకు నిలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్య పరిచే కొన్ని విశేషాలు ఇక్కడ కనిపిస్తాయి. మరి అవేంటంటే..

స్వయంభువుగా వెలసిన స్వా మి విగ్రహం :
తిరుమలలోని మూలవిరాట్‌ విగ్రహాన్ని మానవులు చెక్కలేదని, అది స్వయంగా వెలసిన స్వయంభూ రూపమని భక్తుల విశ్వాసం .ఈ కారణంగా ఈ విగ్రహానికి ప్రత్యే కమైన దైవిక ప్రాధాన్యం ఉంది.

Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!

చల్లని వాతావరణం లోనూ విగ్రహం నుంచి వేడి:
తిరుమల కొండలు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి. అయితే గర్భ గుడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సాధారణ రాతి విగ్రహం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుందని చెబుతారు. ఇది భక్తుల్లో ఆశ్చర్యాన్ని కలిగించే అంశంగా నిలిచింది.

ఎప్పుడూ తడిగా ఉండే విగ్రహం వెనుక భాగం :
స్వామివారి విగ్రహం వెనుకభాగం ఎప్పుడూ తడిగా ఉంటుందని ఆలయ సంప్రదాయాలు చెబుతున్నాయి. దీనికి స్పష్టమైన శాస్త్రీయ కారణం ఇప్పటికీ వెల్లడికాలేదు. భక్తులు దీనిని దైవ మహిమగా భావిస్తారు.

గర్భగుడి వెనుక వినిపించే సముద్రఘోష:
తిరుమల సముద్రానికి చాలా దూరం లో ఉన్నప్పటికీ, గర్భగుడి వెనుక గోడకు చెవి ఆనిస్తే సముద్ర అలల శబ్దం వినిపిస్తుందని అనేక మంది భక్తులు చెబుతుంటారు. ఈ విషయం ఇప్పటికీ ఒక రహస్యం గానే మిగిలిపోయింది.

శతాబ్దాలుగా వెలుగుతున్న అఖండ దీపాలు:
గర్భగుడిలో వెలిగే కొన్ని దీపాలు ఎన్నో సంవత్సరాలుగా ఆరిపోకుండా వెలుగుతున్నాయని విశ్వాసం . ఈ అఖండ దీపాలు
తిరుమల ఆలయ మహిమను మరింత గొప్పగా నిలబెడుతున్నా యి.

స్వామివారి జుట్టు:
శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లోని జుట్టు సహజంగా, మృదువుగా కనిపిస్తుందని భక్తులు చెబుతారు. దీనికి సంబంధించి గంధర్వ కన్య తన కేశాలను స్వామివారికి సమర్పించిందనే పురాణ కథ కూడా ప్రసిద్ధి చెందింది.

దైవిక అనుభూతి:
తిరుమల ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని చెబుతారు. ఇద
కారణంగా ప్రతిరోజూ వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించేందుకు తరలివస్తున్నా రు.

Share this post with your friends