రావణాసుర వాహనంపై శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యానుగ్రహం..

రిషికేష్‌‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అలా ముగిసిన వెంటనే ఆంధ్ర ఆశ్రమంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. ధ్వజారోహణంతో ఈ ఉత్సవాలను ప్రారంభించిన అర్చకులు.. ధ్వజావరోహణం, రావణాసుర వాహనంతో ముగింపు పలికారు. ఈ నెల 2 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు ఈ బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు హాజరయ్యారు.

జూన్ 1వ తేదీ సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగింది. ఆ వెంటనే స్వామివారిని మూషిక వాహనంపై ఊరేగించారు. ఇక జూన్ 2 నుంచి వివిధ రకాల వాహన సేవలను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నిర్వహించారు. జూన్ 5వ తేదీ సాయంత్రం శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇక నిన్న ఉదయం స్వామివారికి ధ్వజావరోహణం నిర్వహించారు. నిన్న సాయంత్రం రావణాసుర వాహనంపై స్వామివారి దివ్యానుగ్రహం భక్తులకు లభించింది. ఈ వాహన సేవ అనంతరం బ్రహ్మోత్సవాలకు అర్చకులు ముగింపు పలికారు.

Share this post with your friends