బాలుడి రూపంలో ధ్యానముద్రలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం

తిరుచెందూర్‌లో సుబ్రహ్మణేశ్వరుడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆలయంలో స్వామివారి రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి తేజో రూపం భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. బాలుడి రూపంలో ధాన్య ముద్రలో సుబ్రహ్మణ్యేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తాడు. ఇలా బాలుడి రూపంలో స్వామివారు సాక్షాత్కారమివ్వడం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. అంతేకాకుండా స్వామివారు ఇద్దరు రాక్షసులను అంతం చేశారని తెలుసుకున్నాం కదా.. ఆ ఇద్దరిని కూడా బాలుడి రూపంలో ఉన్న కుమారస్వామి సంహరించారట. ఆ తరువాత బాల సుబ్రహ్మణ్యస్వామిగా తిరుచెందూర్లోనే కొలువయ్యారట.

భుజంగ స్తోత్రం కూడా ఈ ఆలయంలోనే పుట్టిందని తెలుసుకున్నాం కదా.. ఈ భుజంగస్తోత్రం మహత్స్యం ఏంటంటే.. మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించే కొన్ని దోషాలైన నాగ దోషం లేదా కాల సర్ప దోషం వంటి వాటి నుంచి విముక్తి కల్పిస్తుందట. మనం తప్పు చేయకపోవచ్చు కానీ, ఎక్కడో వంశంలో జరిగిన తప్పు కారణంగా మనం పలు దోషాలను అనుభవిస్తూ ఉంటాం. సంతానం కలుగక పోవడం, కుష్టు రోగం వంటివి ఇలాంటి దోషాల కారణంగానే జరుగుతాయట. వాటన్నింటినీ సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియజేశారు. ఈ భుజంగ స్తోత్రాన్ని నిత్యం పఠిస్తే నాగ దోషం, కాల సర్ప దోషం వంటి భయంకరమైన దోషాలు తొలగిపోతాయని చెబుతారు.

Share this post with your friends