బాలుని రూపంలో సుబ్రహ్మణ్యస్వామి ప్రత్యక్షం.. రాత్రికి రాత్రే గుడి నిర్మాణం

కర్నూలు జిల్లా పాణ్యం మండల కేంద్ర నుంచి పాణ్యం నుండి 20 కి.మీ. దూరంలో కొత్తూరు గ్రామంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఎలా లభ్యమైందో తెలుసుకున్నాం. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. బీరం చెన్నారెడ్డి అనే రైతు నాగలితో పొలం దున్నుతుండగా.. 12 తలల నాగేంద్రుడి విగ్రహం లభ్యమైంది. అయితే చెన్నారెడ్డికి కంటి చూపు పోయింది. అప్పుడొక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని, మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెప్పాడట. అలా అభిషేకాలు చేయగానే చెన్నారెడ్డికి కంటి చూపు వచ్చిందట. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే సుబ్రహ్మణ్య స్వామి గుడి నిర్మాణం గావించారు. ఆ తరువాత స్వామివారు రాత్రి రోకలిపోటు తరువాత మొదలుపెట్టి, తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి అని స్వామి సెలవిచ్చాడట. అలా చేయకుంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరించడంతో అంతా ఆందోళన చెందారట. అసలు రాత్రికి రాత్రే గుడి నిర్మాణం ఎలా గావించాలని భావించి తక్షణమే పైకప్పు లేని ఆలయమైతే సిద్ధమవుతుందని భావించి పైకప్పు లేకుండా ఆలయాన్ని గ్రామస్తులంతా కలిసి పూర్తి చేశారట. ఆలయంలో నిత్యపూజలను శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యుని దర్శించి పూజిస్తే నాగసర్ప దోషాలు, కుజ దోషాలు తొలగిపోవడంతో పాటు సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందట.

Share this post with your friends